కట్టుకున్న వాడినే కాటికి పంపింది
మెదక్ : కట్టుకున్న వాడినే కాటికి పంపింది ఓ భార్య. వివరాల్లోకి వెళ్తే.. బేగంపేటలో కానిస్టేబుల్ నరసింహులును భార్య బాలలక్ష్మీ హత్య చేసింది. భర్తను హత్య చేసిన భార్య గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని విచారిస్తున్నారు. మృతుడి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.