కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా
వరంగల్ రూరల్ : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.