కడియం అధిక వర్షాలకు కడియంలో నిలిచిన ఎగుమతులు
అధిక వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీల్లో ఎగుమతులు నిలిచిపోయాయి. నాలుగురోజులుగా వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన లారీలు నిలిచిపోయాయి. లక్షలాది రూపాయల విలువైన సీజనల్ మొక్కలు పూర్తిగా పాడైపోయాయి. మండలంలోని 5 వేల ఎకరాల్లో వరి నేలకోరిగింది. అంతరాష్ట్ర కడీయ పులంక పూల మార్కెట్‌లో అమ్మకాలు నిలిచిపోయాయి. మార్కెట్ నీటితో నిండిపోయింది. రూ. 30 లక్షల వ్యాపారం అగిపోయింది.