కడుపులో కత్తుల ఫ్యాక్టరీ

41471683652_625x300అమృతసర్ : కడుపునొప్పిగా ఉంటోందని వచ్చిన ఓ వ్యక్తికి స్కానింగ్ చేసిన డాక్టర్లు అదిరిపడ్డారు. ముందుగా తమను తామే నమ్మలేకపోయారు. తాము చూస్తున్నది నిజమో కాదో తేల్చుకోడానికి వాళ్లకు చాలా సమయం పట్టింది. అవును.. ఆ పేషెంటు కడుపులో ఏకంగా ఓ కత్తుల ఫ్యాక్టరీయే ఉంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నగరంలో వెలుగు చూసింది.
పేషెంటు కడుపులో కత్తులు చూడగానే తాము కూడా ఆశ్చర్యపోయామని, ఒకానొక సమయంలో అయితే తామే ఆ కత్తులు మింగేశామా అని కూడా అనిపించిందని వైద్యులు చెప్పారు. ఇప్పటివరకు ఇలాంటి కేసు తాము ఎక్కడా చూడలేదని అన్నారు. ఏదో మానసిక సమస్యతో బాధపడుతుండటం వల్లే అతగాడు ఆ కత్తులన్నీ మింగేశాడని తెలిపారు. మొత్తం ఈ కత్తులన్నీ మింగడానికి అతడికి రెండు నెలల సమయం పట్టిందట. ఐదుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందం అతగాడికి ఆపరేషన్ మొదలుపెడితే.. ఐదు గంటలు పట్టింది. అతడి కడుపులో నుంచి మొత్తం 40 కత్తులు బయటపడ్డాయి. డాక్టర్‌గా తాను కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి కేసు ఎన్నడూ చూడలేదని సర్జన్ డాక్టర్ జితేంద్ర మల్హోత్రా చెప్పారు.