కదిలించిన ‘జనంసాక్షి’ కథనం`
‘పసివాడికి ప్రాణం పోయండి’ కథనానికి స్పందన`
జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో కదిలిన డిడబ్ల్యువొ అధికారులు
కరకగుడెం,ఫిబ్రవరి 27(జనంసాక్షి): ఫిబ్రవరి 26న జనంసాక్షి దినపత్రిక లో ప్రచురించిన ‘పసివాడి ప్రాణం పోయండి’ అనే కథనానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పందించారు. జిల్లా సంక్షేమ అధికారిణి వరలక్ష్మి ఆదేశాల మేరకు ఈఓ హసీనా, సి డి పి ఓ జయలక్ష్మి, ఐ సి పి ఎస్ శేషులు కరకగుడెం మండలంలోని వ్యాధితో బాధపడుతున్న నాగదీపక్ ఇంటికి వెళ్లారు. బ్రెయిన్ ఎదుగుదల లేక మంచానికే పరిమితమైన నాగదీపక్ కు వీల్ చైర్ ను అందించారు. నిత్యావసర సరుకులు, కొంత నగతును అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు. నాగదీపక్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన తదుపరి మెరుగైన వైద్య చికిత్సకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 89 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న పసివాడికి పింఛన్ త్వరలోనే అందేలా చూస్తామని తల్లిదండ్రులకు హావిూ ఇచ్చారు. పత్రికలో వార్తను ప్రచురించి అధికారులు స్పందించేల చేసిన జనంసాక్షి దినపత్రిక యాజమాన్యానికి, స్థానిక విలేఖరికి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.