కదిలే రైలునుంచి బాలికను తోసిన యువకుడు
బుర్ద్వాన్: పాఠశాల అనంతరం ట్యూషన్‌కు వెళ్లి తిరిగివస్తున్న సుజయ బసక్ అనే 17ఏళ్ల బాలికను ఒక యువకుడు శనివారం నడుస్తున్న రైలునుంచి తోసివేయడంతో బాలిక అక్కడిక్కడే మరణించింది. ఆమె స్నేహితులు అరవడానికి ప్రయత్నించగా వారిని కూడా తోసివేస్తానని అతను బెదిరించటంతో భయపడిన బాలికలు ఆ యువకుడు పారిపోవయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలు తెలిపిన వివరాల మేరకు రైలు పట్టాల పక్కన వెతికిన పోలీసులకు రక్తపుమడుగులో సుజయ మృతదేహం కన్పించింది. ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడి కోసం వారు అన్వేషిస్తున్నారు.