కనిపించని సమాధానం వికాస్‌

మోడీ తీరుపై మండిపడ్డ పాటీదార్‌ పటేల్‌

గాంధీనగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై వ్యంగంగా స్పందించారు. ప్రధాని మోదీ పదేపదే వ్లలెవేసే ‘వికాస్‌’ను విమర్శనాత్వంగా ఒక చిట్టి కథతో వివరించారు. అత్యంత ప్రజాధరణ కలిగిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమాన్ని ఉదాహరణగా తీసుకున్న హార్దిక్‌ తనదైన శైలిలో చమత్కరించారు. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి కార్యక్రమంలో లాలాకు ¬స్ట్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఆఖరి ప్రశ్న సంధించారు. ‘ఎప్పుడూ వినిపిస్తుంది. కానీ కనిపించదు అది ఏంటి?’ అని అడిగిన అనంతరం అమితాబ్‌ నాలుగు సమాధానాలు చెప్పడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే లాలా ‘వికాస్‌’ అని సమాధానం ఇచ్చారు. దీంతో లాలాను అమితాబ్‌ విజేతగా ప్రకటించి, 14 కోట్ల రూపాయలిచ్చారు. అనంతరం హత్తుకొని అభినందించారు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.మోదీ ఎప్పుడూ చెప్పే వికాస్‌ ఆయన మాటల్లోనే ఉంది కానీ, ఆచరణలో లేదని హార్దిక్‌ వివరణ ఇచ్చారు. కాగా దీనిపై నెటిజెన్లు సైతం కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మోదీ వికాస్‌ మాట అటుంచితే విూ ఉద్యమం (పాటీదార్‌) మాటేమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.