కనీస విద్య అభ్యసన సామర్థ్యాలకై కృషి చేయాలి-ఏటీడబ్లుఓ

ఓ ఇల్లుకు పునాది ఎంత అవసరమో అలాగే విద్యార్థుల విద్య ప్రమాణాలు పెంపుకు బేసిక్  విద్య అంతే అవసరమని అందుచేత విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాల స్థాయిని పెంపొందించాలని ఏటీడబ్లుఓ సౌజన్య అన్నారు.రెండవ విడత అక్షర జ్యోతిలో భాగంగా గురువారం రోజున మండలంలోని లఖంపూర్ ఆశ్రమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల హాజరు శాతాన్ని భోజనం వంటగది అక్కడి స్థితిగతులను పరిశీలించి నాణ్యమైన విద్య ఆహారాన్నిఅందించాలని,తరగతుల వారిగా సామర్థ్యాన్ని మెరుగు పర్చాలని ఉపాద్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో  ఏటీడబ్లుఓ తోపాటు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాద్యాయులు ఉన్నారు.