కన్నీల సంద్రమైన నిమ్మాడ
శ్రీకాకుళం : తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు అకాల మృతితో అయన స్వగ్రామం నిమ్మాడ కన్నీటి సంద్రమైంది. వేలాదీ మంది శోకతప్త హృదయాలతో తమ అత్మీయ నేతకు నివాళులర్పించారు.ఉత్తరాంద్ర జిల్లాల నుంచి నిమ్మాడకు వందలాది వాహనాల్లో తెదేపా శ్రేణులు తరలివస్తున్నాయి. శనివారం ఉదయం 9 గంటలకు నిమ్మాడలో అయనఅంత్యక్రియలు జరుగనున్నాయి. పోలిసు లాంచనాలతో అయనకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అదేశించారు.