కన్న ఊరు పై ప్రేమతో 60 వేలతో బస్ షెల్టర్ నిర్మాణం
ఆదర్శంగా నిలుస్తున్న రాఘవరెడ్డి*
పెగడపల్లి సెప్టెంబర్ 11(జనం సాక్షి )పెగడపల్లి మండల కేంద్రంలోని నర్సింహునిపేట గ్రామానికి చెందిన గంగాడి రాఘవరెడ్డి విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఊరుకు ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆలోచనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకుండా మానవత దృక్పథంతో 60 వేల రూపాయలతో బస్సు షెల్టర్ నిర్మాణం చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన చేసిన సేవలను పలువురు అభినందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాబుస్వామి, పెగడపల్లి మండలం ఏ యి శ్రీనివాస్, ఉపసర్పంచ్ చంద్రరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లింగయ్య, వార్డ్ సభ్యులు సంజీవ్ రెడ్డి, చంద్రయ్య, శాంతపోచయ్య, మరియు అంబేద్కర్ సంగం నాయకులు, ఎల్లయ్య, స్వామి, రాజనర్సయ్య, గంగారాం, చంద్రయ్య, పోచయ్య, కొండయ్య, అంజయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.