కబ్జా చేయలేదు- డబ్బులు పెట్టే కొనుగోలు చేశా…

ఇల్లు పర్మిషన్ కు 5 లక్షలు అడిగిన సర్పంచ్
– ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 జనంసాక్షి;
కామారెడ్డి జిల్లా :దోమకొండ మండల కేంద్రములో ని ముత్యంపేట గ్రామములో

తాను తన స్వంత డబ్బులతో 1100 గజాల స్థలాన్ని కొనుగోలు చేశానని,నేను ఎ స్థాలన్ని కబ్జా చేయలేదని ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ అన్నారు.సోమవారం దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో గ్రామ పంచాయతి కార్యాలయం ఆవరణలో ఆయన విలేఖరుల సమావేశం మాట్లాడారు. తాను కొన్న 1100 గజాల స్థలాన్ని గ్రామ సర్పంచ్ తో పాటు పలువురు అది ప్రభుత్వ స్థలం అని లేని పోని ఆరోపణలు చేశారు.అందుకు నిజానిజాలు తెలియజేయాలనే సమావేశం నిర్వహించామన్నారు.
గ్రామానికి చెందిన
మంద నర్సారెడ్డి,మంద చిన్న భారతి,మంద పెద్ద భారతి,మంద రంజిత్, రవిందర్ రెడ్డి,మంద అంజనేయులు,మంద నర్సారెడ్డి లకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేశానని వివరించారు. వారు కూడ 60 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నామని ఆ స్థలాన్ని మాకు ఉన్న ఆర్థిక ఇంబందులతో అమ్మనినామని వారు తెలిపారు. ఇంటి నిర్మాణం కొరకు పర్మిషన్ అడుగగా 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని వివరించారు. వాటిని సర్పంచ్ చెప్పిన ముగ్గురు వ్యక్తులకు పైసలను అప్పజెప్పామని తెలిపారు. అందుకు సంబంధించిన అన్నిరకాల ఆదారాలు ఉన్నాయని చెప్పారు.
ఈ సమావేశంలో మహెందర్ గౌడ్,రవి,హరీష్,అఖిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.