కమిషన్ల కోసమే….మిషన్ భగీరథ

అందరూ దొంగలే
కలుషిత నీరు తాగి మృతి చెందిన నలుగురి కుటుంబాలకు పరామర్శించిన వై ఎస్ షర్మిల *

ఆర్థిక సాయం పది వేల రూపాయలు అందచేత

**టిఆర్ఎస్ పార్టీ కి తెలిసింది
బీడీ బిచ్చం కళ్ళు ఉద్ధరా**

ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత …వై ఎస్ ఆర్…… దే నడిగడ్డ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ వైయస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల

గద్వాల ఆర్ సి.(జనంసాక్షి) ఆగస్ట్ 23,

గద్వాల్ జిల్లాలోని వై ఎస్ ఆర్ చౌక వద్ద షర్మిల రాకతో భారీగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కెసిఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని ఆశ చూపిన మాట నెరవేరిందా అని గద్వాల్ నడిగిడ్డ ప్రజలను ప్రశ్నించారు. హామీలు తప్ప అమలు చేయలేని ప్రభుత్వం కెసిఆర్దే అని స్పష్టం చేశారు. కలుషిత నీరు తాగి మృతి చెందిన నలుగురి కుటుంబాలను ఆదుకోలేని ప్రభుత్వం కెసిఆర్ ది అని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, కానీ బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ కానీ ఎవరైనా ప్రజల ప్రాణాలు పోతున్న కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని డీకే కుటుంబ వాసులు అని తెలిపారు.మిషన్ భగీరథ , కాకతీయ అంటూ కమిషన్లకే పరిమితమైన కెసిఆర్ అని తెలిపారు. 40 వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మించి వాటిలో ఒక కమిషన్లు వండుకున్నారని ఆరోపించారు.1.50 లక్ష యాబై వేల కోట్లతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే మునిగిపోయిందని కనీసం రక్షణ గోడను మట్టితో కట్టడం వల్లే మునిగిపోయిందని చెప్పారు. కెసిఆర్ కి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని తిరిగి రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొస్తానని ప్రజల మధ్య ప్రజల కొరకే ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యలను పోరాడుతునే ఉంటా అని తెలిపారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందరూ దొంగల ముఠా అని అవినీతే వీరి సంక్షేమం అని తెలిపారు. ఆమె వెంట రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్ రెడ్డి ప్రచార కమిటీ అధ్యక్షుడు నీలం రమేష్ గద్వాల జిల్లా నాయకుడు అతికుర్ రహ్మాన్ నియోజకవర్గం పరిశీలకులు పచ్చిపాల వేణు యాదవ్ షాద్నగర్ నియోజకవర్గం ఆర్డినేటర్ ఇబ్రహీం ఉమ్మడి జిల్లా పరిషయులకులు శ్రీనివాసులు తదితరులు
నాయకులు అభిమానులు పాల్గొన్నారు.