కమ్మేసిన పొగమంచు
` రహదారి కనిపించక వరుస ప్రమాదాలు
` విమానాల,రైళ్ల రాకపోకలకు అంతరాయం
` ఉత్తరాది నుంచి బలమైన గాలులు..
` తెలంగాణలో చలి తీవ్రత అధికం
న్యూఢల్లీి:రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.మరో రెండ్రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు. జనవరి ఒకటో తేదీ తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిరచారు.మరో వైపు హైదరాబాద్ శివారులో చలిపులి పంజా విసురుతోంది. ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చలి తీవ్రత పెరగటంతో చిన్నారుల్లో నిమోనియా సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గవదబిళ్లల సమస్యలతో చిన్నారులు భారీగా ఆసుపత్రుల్లో చేరుతున్నారని చెప్పారు.
విశాఖలో పొగమంచుతో ఒకదానికొకటి ఢీకొన్న ఐదు వాహనాలు
విశాఖ: విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
విమానాల రాకపోకలకు అంతరాయం
దిల్లీ: ఎముకలు కొరికే చలితో దేశ రాజధాని దిల్లీ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో పొగమంచు (ఆవనిబవ ఈనీణ) నగరాన్ని కప్పేసింది. దీంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అటు రవాణా వ్యవస్థపై పొగమంచు పెను ప్రభావం చూపిస్తోంది. విమానాలు , రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.పొగమంచు దట్టంగా వ్యాపించడంతో ఉదయం కూడా రాత్రిని తలపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 50 విూటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు తగ్గింది.పొగమంచు కారణంగా దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడిరచారు. దిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారిమళ్లిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం పడిరది. రాజధానికి రావాల్సిన దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే వెల్లడిరచింది.
వణుకుతున్న ఉత్తరాది..
ఉత్తరాదిన పలు రాష్ట్రాలను చలి గజగజలాడిస్తోంది. పాటియాలా (పంజాబ్), లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్ (యూపీ)లో 25 విూటర్ల మేరే కన్పిస్తోంది. అమృత్‌సర్ (పంజాబ్)లో అయితే కనీసం ముందున్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్డు రవాణా ప్రభావితమైంది. మరికొన్ని రోజులపాటు దిల్లీ సహా పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.