కరాటే పోటీల్లో విద్యార్థుల అద్భుత ప్రతిభ

జనంసాక్షి, మంథని : జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ షోటోఖాన్ కరాటే తార్ కప్ సిద్దిపేట లో మంథని షోటో ఖాన్ కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. సెప్టెంబర్ 24 ఆదివారం సిద్దిపేట లో జరిగిన నేషనల్ కరాటే చాంపియన్ షిప్ లో మంథని షోటో ఖాన్ కరాటే ఇన్స్ట్రక్టర్ కొండ్ర నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు పాల్గోని ప్రతిభను కనబర్చినారు. కటా, కుమితే విభాగంలో ప్రతిభను కనబరిచి మెడల్స్ సాధించటం జరిగింది. మెడల్స్ సాదించిన విద్యార్థులు… బీర ఆదిత్య తేజ బ్లాక్ బెల్ట్ కటా విభాగంలో గోల్డ్ మెడల్, కుమీతే లో సిల్వర్, ఐలి ఉదయ్ కుమార్ బ్లాక్ బెల్ట్ కూమితే లో సిల్వర్ మెడల్, రోహిత్ కుమార్ కుమితె లో బ్రొంజ్, వడ్లకొండ శ్రీనిత కుమితేలో సిల్వర్, కటా లో బ్రోంజ్, శుశృత్ కుమితే లో గోల్డ్ కటా లో సిల్వర్, మోడెమ్ యశ్వంత్ కటా లో గోల్డ్ , మెరుగు అర్జున్ కుమితీ లో సిల్వర్ కటా లో బ్రోంజ్ , నిక్షెప్ సాయి కటా లో సిల్వర్, కుమితే లో బ్రాంజ్, శ్రిరాజ్ కటా బ్రాంజ్ ఆరుషి కటా లో సిల్వర్, రెగటి రిషిత్ పటేల్ కటా విభాగంలో బ్రంజ్ మెడల్స్ సాధించారు. కరాటే పోటిలలో గెలుపొందిన విద్యార్థులను మంథని షోటో ఖాన్ కరాటే జోనల్ ఇన్స్ట్రక్టర్ నూకల భానయ్య తదితరులు అభినందించారు.