కరాటే వీరులకు ఘనంగా సన్మానం
సిద్దిపేట,జూన్8(జనం సాక్షి): ఈ నెల 2,3తేదీల్లో ముంబైలో జరిగినటువంటి ఇంటర్ నేష్నల్ కరాటే పోటీలలో పదిహేను దేశాలు పాల్గొన్నగా, వాటిలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రానికి చెందిన ఐదుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్ ఇద్దరు సిల్వర్ మెడల్స్ సాధించుకున్నారు. దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన మెరుపులా సాయికృష్ణ గౌడ్,మరోజి. నేహా గోల్డ్ మెడల్ సాధించారు. మరో రెండు సిల్వర్ పతకాలను దుబ్బాక గ్రామనికి చెందిన పరస రాజ్యలక్ష్మి ,మారోజు రాకేష్ , వినయ్ సిల్వర్ పతకాలు సాధించుకున్నారు. వీరిని శ్రీచక్ర సేవాసమితి,స్కూల్ యాజమాన్యం టీచర్స్ ఆధ్వర్యంలో నగర పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం పాఠశాలలో వారికి సన్మాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక స్కూల్ ప్రిన్సిపాల్స్, టీచర్స్, శ్రీ చక్ర సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.