కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మంథని డివిజన్‌లో భారీ వర్షం వల్ల పెద్దంపేట, సర్వాయిపేట, తీగలవాగులు పొంగిపొర్లుతున్నాయి. అటవీ ప్రాంతంలోని 17 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. మెట్‌పల్లిలో భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక్కడ 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.