కరెంటు కోతపై రైతుల రాస్తారోకో
మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా అద్యక్షుడు రామచంద్రారెడ్డి
అయిజ,జూన్ 18 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా
అయిజ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు పంట పొలాలకు విద్యుత్ సరఫరా అరకొరగా ఉందని రోజుకి 6 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని.
ఐజ పట్టణ కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం జరిగింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.
అయిజ సబ్ స్టేషన్ లో గత ఆరు నెలలనుంచి ae లేకపోవడం ఏడి వున్నా పలుమార్లు సెలవు పై వెళ్లడం వల్ల కింది స్థాయి సిబ్బంది రైతులకు సారి అయిన సమాధానం ఇవ్వకపోవడం అదే విదంగా 2018 ఎన్నికల సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కడం ఇచ్చిన హామీ ని గాలికి వదిలి కనీసం రైతుకు అవసరమైన సమయంలో6 నుంచి 7 గంటల కరెంట్ ఇవ్వకపోవడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు ఇట్టి విషయం పై శాంతినగర్ సిఐ శివ శంకర గౌడ్ వెంటనే స్పందించి రాస్తారోకో దగ్గరకు వచ్చి జిల్లా ఎస్ఈ తో మాట్లాడి స్పష్టమైన హామీ తీసుకొని 24 గంటల లోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ఈ రాస్తారోకో వివరించడం జరిగింది.
ఈ కార్యకర్మంలో రైతులతోపాటు పట్టణ మండల అధ్యక్షులు నర్సింహ య్య శెట్టి,షేకర్ సీనియర్ నాయకులు మెడికల్ తిరుమల రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యుడు భీమ్ సేన్ రావు,మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ,వెంకటేష్ తుంకుంట అంజి,అంతంపల్లి కృష్ణ పట్టణ బిజెవైయం అధ్యక్షులు సింహాద్రి స్నేహ అంజి తదితరులు పాల్గొన్నారు
Attachments area