కరెంటు లేదు కంప్యూటర్లు ఇస్తారా..?

1
– మోదీ ఎద్దేవా

పాట్నా,అక్టోబర్‌26(జనంసాక్షి): బీహార్‌ను ఇన్నేళ్లు పాలించిన నితీష్‌ ఇక్కడ కనీసం విద్యుత్‌ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. సోమవారం ఆయన బక్సర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువతకు కంప్యూటర్లు ఇస్తామంటున్న నితీష్‌ అసుల కరెంట్‌ లేకుంటే వాటితో ఏం చేస్తారని అన్నారు. ఇక సీఎం నితీశ్‌ కుమార్‌ కంప్యూటర్లు ఇస్తామంటున్నారని, కానీ కరెంటు లేకుండా యువత కంప్యూటర్లు ఏం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. పైగా.. విూ కంప్యూటర్లలో లాలు వైరస్‌ సోకిందని, ముందు దాన్ని బిహార్‌ నుంచి తరిమేయాలని అన్నారు. బీహార్‌కు లాలూ వైరస్‌ సోకిందని ఎద్దేవా చేశారు. మహాకూటమి నేతలకు ఓటమి తప్పదని అర్థమైందని, అందుకే ఇప్పుడు మంత్ర తంత్రాలను ఆశ్రయిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.బీహార్‌ అభివృద్ది లక్ష్యంగా తాము చేస్తున్న కృషికి యువత ముందుకు రావాలన్నారు. భవిత విూ చేతల్లో ఉందని, నిర్ణేతలు విూరేనని అన్నారు. స్తుతం ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదారు రోజులు మిగిలి ఉన్నాయని, ఈలోపే ఎన్ని తిట్లు తిట్టుకుంటారో తిట్టేసుకోవాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌, జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కానీ, ఎంత బురద చల్లితే.. కమలం అంతగా వికసిస్తుందన్న విషయం తెలుసుకోవాలంటూ చురక అంటించారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న సోనియా గాంధీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బిహార్‌ రాష్టాన్న్రి 35 ఏళ్లు పాలించిందని, మరి విూరు  బాధ్యులు కారా అని ప్రశ్నించారు. వాళ్లు ఇక్కడికొచ్చి, తనను రాష్ట్ర పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటారన్నారు. రెండో హరిత విప్లవం బిహార్‌ నుంచే వస్తుందని, ఇక్కడ వనరులు, భూమి, శక్తి అన్నీ ఉన్నాయని బిహార్‌ వాసులకు చెప్పారు. బిహార్‌లో నీటికి కొరత లేకపోయినా, ఇక్కడి పొలాలకు మాత్రం నీళ్లు రావట్లేదని మోదీ మండిపడ్డారు. ఆ నీళ్లు తెప్పిస్తే, రైతులు భూమి నుంచి బంగారం పండిస్తారని తెలిపారు.