కరెంటు షాట్ సర్క్యుట్ తో దుకాణం కాలిబుడిదైంది.

నెరడిగొండనవంబర్2(జనంసాక్షి):ఉన్నత విద్య చదివి ఉద్యోగం రాక కుటుంబ పోషణ కోసం ఓ కిరాణా దుకాణం పెట్టి కొనసాగిస్తున్న క్రమంలో బుధవారం రోజున ఉదయం మూడు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యుట్ తో దుకాణం కాలిబుడిదైన ఘటన మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కుంటాల కే గ్రామానికి చెందిన ఎల్లుల రాములు కిరాణా దుకాణం కరెంటు షార్ట్ సర్క్యుట్ తో ఉదయం కిరాణా దుకాణం కాలిపోతూన్న పొగమంటను గ్రామస్తులు గమనించి దుకాణం యజమానికి సమాచారం అందించారు.ముందు రోజే  రెండు లక్షల రూపాయల సామగ్రిని తీసుకుని వచ్చిన అన్ని రకాల కిరాణా వస్తువులు దుకాణంలో ఉన్న విలువైన ప్రిజ్ సహా అన్ని కాలిబూడిదైనవి.ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాధితులు గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.విద్యుత్ శాఖ  రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని స్థానికులతో అడిగి తెలుసుకుని పరిశీలించి పంచనామా నిర్వహించారు.బాధితుడికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం నుంచి అందించాలని స్థానికులు కోరారు.
 

తాజావార్తలు