కరెంట్ కోతలను నిరసిస్తూ పరిశ్రమల మూసివేత
కరీంనగర్, జనంసాక్షి: విద్యుత్ సమస్యలపై వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు నిరసనగా జిల్లా వ్యాప్తంగా 10 పరిశ్రమలను మూసివేశారు. పరిశ్రమలను మూసివేసి కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. కరెంట్ కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్‌కు మద్దతుగా రైస్ మిల్లుల్లో కార్మికులు విధులు బహిష్కరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.