కరెంట్‌ షాక్‌తో ఇద్దరు బాలికలు మృతి

కోటవురట్ల: విశాఖజిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామాంలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఒకటో తరగతి చదువుతున్న పెంటా ఝాన్సీ (9), 3వతరగతి చదువుతున్న పెంటా సాయికుమారి(9)లు కనకాంబరాలు ఏరుతుండగా సర్వీసు వైరు తెగి వారిపై పడటంతో విద్యుదాఘాతానికి గురయ్యారు.ఎస్‌.ఐ. గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.