కరెంట్ సత్యాగ్రహానికి ప్రజలు మద్దతు
హైదరాబాద్ : పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతు పెరుగుతోంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని రెంట్ సత్యాగ్రహ ప్రాంగణానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. విజయమ్మకు సంఘీభావం తెలుపుతున్నారు. అశేషంగా తరలివస్తున్న వారితో దీక్షా వేదిక సందడిగా మారింది. దీక్షావేదిక వద్దకు వస్తున్న ప్రతిఒక్కరూ విజయమ్మను పలకరిస్తున్నారు.



