కరెంట్ స్తంభం ఎక్కిన రైతు మృత్యువాత
యాదాద్రి భువనగిరి,జూన్7(జనం సాక్షి): యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అమాయక రైతు విద్యుత్ స్తంభం ఎక్కి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మూటకొండూరు మండలం కొండాపూర్‌లో జరిగింది. రవీందర్ రెడ్డి అనే రైతు విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ఆయన ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో స్తంభంపైనే రవీందర్ రెడ్డి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.