కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
మెదక్ జిల్లాలోని సుల్తాన్ పూర్ గ్రామంలో కరెంట్ ఫెన్సింగ్ ఓ వ్యక్తిని బలి తీసుకుంది. రమేశ్ అనే రైతు తన పొలానికి రక్షణగా రాత్రిపూట కరెంటు ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి వైర్లకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఓ బర్రె కూడా మృతి చెందింది.