కరోనా నుంచి కోలుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు.

కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగ వేడుకలు
దుబ్బాక 12, ఆగష్టు ( జనం సాక్షి )
దుబ్బాక ఎమ్మెల్యే మధవనేను రఘునందన్ రావు
జ్వరం కారణంగా ఈ నెల ఎనిమిదో తేదీన కరోనా పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావుకు  పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన దుబ్బాక లోని క్యాంపు కార్యాలయంలో క్వారంటైన్ లో ఉన్నారు. జ్వరం తగ్గడంతో గురువారం రోజు తిరిగి పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యేకు వైరస్ నెగెటివ్ గా తేలింది. కరోనా నెగిటివ్ తేలడంతో వైద్యుల సూచనల మేరకు గురువారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు రాఖీ పండుగ పండుగ సందర్భంగా వారి నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.