కరోనా బారిన పడ్డ జర్నలిస్టులను ఆదుకున్నాం
– రూ. 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం
– తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్,అక్టోబరు 23(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్ల ఏర్పడిన జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన 1603 మంది జర్నలిస్టులకు 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారంనాడు మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్లో గల విూడియా అకాడమి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్ గా ఉన్న జర్నలిస్టులు వార్తా సేకరణలో భాగంగా పలువురు జర్నలిస్టులకు కరోనా సోకిందని, వీరిని ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందని విూడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. విూడియా అకాడమి ద్వారా కరోనా పాజిటీవ్ వచ్చిన 1517 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల చొప్పున, 3 కోట్ల 3 లక్షల 40 వేలు, దీనితోపాటు ప్రైమరీ కాంటాక్ట్ చేత ¬ంక్వారంటైన్లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, 8 లక్షల 60 వేలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు. మొత్తంగా సంక్షేమ నిధి నుండి 1603 మంది జర్నలిస్టులకు ఇప్పటి వరకు 3 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. విూడియా అకాడమి చరిత్రలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడమనేది ఒక మైలు రాయి అని చైర్మన్ అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్ గాని, గుర్తింపు కార్డు గాని, పాజిటీవ్ వచ్చిన ధృవీకరణ పత్రము, బ్యాంకు వివరాలను విూడియా అకాడవిూ కార్యాలయానికి పంపిన వెంటనే సత్వరమే స్పందించి ఆయా జర్నలిస్టుల ఖాతాలో డబ్బులు జమ చేశామని ఆయన వివరించారు.ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడమిలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం ? తెలంగాణ జర్నలిస్టులకు రక్షణ కవచంలా తయారయ్యిందని అన్నారు. ఆ వంద కోట్ల నిధుల నుండి 34.50 కోట్ల రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయని, ఈ నిధి విూద వచ్చిన వడ్డీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడమి అమలు చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి సంక్షేమ నిధి కాని, జర్నలిస్టులను ఆదుకోవడం కాని, దేశంలో ఎక్కడా లేదని తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడమి సగర్వంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర విూడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు విూడియా అకాడవిూ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు విూడియా అకాడమి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన హవిూ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో జీత భత్యాలు లేని దాదాపు పన్నెండు వందల మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, సానిటైజర్లు, మాస్కులను విూడియా అకాడమి ఆధ్వర్యంలో పంపిణీ చేశామని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి వచ్చిన వడ్డీ ద్వారా 260 మంది చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున 2 కోట్ల 60 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని, అలాగే దీర&ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన 94 మంది జర్నలిస్టులకు 50 వేల రూపాయల చొప్పున 47 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఆర్థిక సహాయం, ట్యూషన్ ఫీజు, పెన్షన్లను కలుపుకుని మొత్తంగా వీరందరికీ 5 కోట్ల 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. మొత్తంగా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి వచ్చిన 9 కోట్ల రూపాయల వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించినట్లు ఆయన వివరించారు. విూడియా అకాడమి కార్యాలయానికి జర్నలిస్టులు ఆర్థిక సహాయం కోసం 37 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు, మరో 10 మంది దీర&ఝకాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని … వచ్చే నెలలో వీరందరికీ ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో విూడియా అకాడమి కార్యదర్శి డి.ఎస్. జగన్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.