కర్టాటకలో కొనసాగుతున్న బంద్
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదలపై కర్టాటక రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్ రాష్ట్రంలో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది. బెంగళూరు నగరంలో ఆందోళన కారులు నిరసన చేపట్టి బీఎంటీసీ బస్సులను ధ్వంసం చేశారు మంద్య, మైసూర్ హస్సన్, చామరాజానగర్ తదితర కావేరీ బేపిస్ జిల్లాలల్లో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి.బంద్ సందర్భంగా ఎంలాటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.