కర్ణాలపల్లిలో అస్సాం అధికారుల పర్యటన
సంగారెడ్డి, నవంబర్ 9: చేగుంట మండలంలోని కర్ణాలపల్లి గ్రామంలో ఐకేపీమహిళా సంఘ సభ్యులతో అస్సాం సీఈవో రాజేశ్‌కుమార్ భేటీ అయ్యారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు మేనేజర్ సర్ధిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.