కర్నాటక ఎఫెక్ట్ : లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
ముంబై: ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కింపు పక్రియ ఉత్కంఠను రాజేస్తున్నాయి. బీజీపే 90కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లకు పైగా పుంజుకుని 35,779 వద్ద, నిఫ్టీ 57పాయింట్లు ఎగిసి 10865 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 11000 వేల స్థాయి వైపు పరుగులు పెడుతోంది. మెటల్, ఫార్మ, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్ల దోరణి నెలకొంది. పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, గెయిల్, టాటా స్టీల్, టైటన్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3-1 శాతం లాభపడుతుండగా, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, ఐషర్, హెచ్‌పీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా నష్టాల్లో కొనసాగుతున్నాయి.