కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన
– 125 ఎకరాల స్థలం కేటాయింపులు
– ఇమామ్‌లకు 5 వేల వేతనం
– ప్రత్యేక ఉర్దూ బీఎస్సీ
– ఏపీ సీఎం చంద్రబాబు
కర్నూలు,నవంబర్9(జనంసాక్షి):
మైనార్టీల సంక్షేమం టిడిపి లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వారికోసం అనేక పథకాలతో ముందుకు వెళుతున్నామని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఉర్దూ కోసం ప్రత్యేక డీఎస్సీని నిర్వహిస్తామని ప్రకటించారు. ఆయన సోమవారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొని మాట్లాడుతూ . ఉర్దూ యూనివర్సిటీ కోసం 125 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నెల నుంచి ఇమామ్ లకు రూ. 5 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ జిల్లాలో ముస్లింలు అదికంగా ఉన్నచోట వారు కోరిన విదంగా షాదీఖానా, ఈద్ గా వంటివాటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించానని అన్నారు. అదేవిధంగా షాదీఖానా కోసం స్థలం కేటాయిస్తున్నామన్నారు. కర్నూలులో 900 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకాబోతుందన్నారు. మరో వైపు కర్నూలులో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఎడ్యుకేషన్ హబ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఉదర్దూ యూనివర్సిటీతో ఈప్రాంతం రూపురేఖలు మారుతాయమన్నారు. అంతేగాకుండా అభివృద్దికి కేరాప్‌గా మారుతుందన్నారు.
కర్నూలులో 900 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, ప్లలె రఘునాధరెడ్డి తదితరులు
పాల్గొన్నారు. డిప్యూటి సిఎం కెఇ మాట్లాడుతూ అభివృద్ది అంటే చంద్రబాబు అని అన్నారు. ప్రపంచంలో ఎవరిని అడిగినా బాబు పేరుచెబుతారని,అయితే కొందరు పార్టీ పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని రోక్షంగా జగన్‌పై దుమ్మెత్తి పోశారు. వారికి అభివృద్ది పట్టదన్నారు. అనంతరం సిఎంన గోరుకల్లుకు చేరుకుని అక్కడ రిజర్వాయర్ పరిశీలించారు.