కలాం మహాత్తర శక్తి
– ఆర్‌ఎన్‌ఐ డైరెక్టర్ జనరల్ ఎంఏ ఖాన్
– దేశానికే అబ్దుల్ కలాం ఆదర్శం
– నవీన్ మిట్టల్
హైదరాబాద్,జులై 24(జనంసాక్షి):కలాం ఒక మహత్తర శక్తి అని దాన్ని మించి వేరే ఆయుధం లేదని ఆర్‌ఎన్‌ఐ జనరల్ ఎంఏ ఖాన్ తెలిపారు.మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్ధుల్‌కలాం ప్రధమవర్థంతి పురస్కరించుకొని కౌన్సిల్ ఫర్ పీస్ అండ్ సాలిడారిటి ఆఫ్ ఇండియా సంస్థ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువు రిని తెలుగు యూనివర్సిటీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కలాం మె మోరియల్ అవార్డులతో సత్కరించింది. అవారుడ గ్రహీతల్లో శైలేష్ అగర్వాల్, దేవేందర్ సురానా(బెస్ట్ ఇండస్ట్రీయలిస్ట్) కల్పనాజీ, విజయ్ సురానా, సురేందర్‌జీలూనియా (సామాజిక సేవ), డాక్టర్ చంద్రకాంత్, డెంటిస్ట్ ( వైద్యరంగం) విజయలక్ష్మీ కాబ్రా, నవీన్ మిట్టల్ (ఉత్తమ అధాకారి) తదితరులు ఉన్నారు. విరేగాకుండా మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ, ప్రోఫెసర్ ఎస్.ఎ.షుకుర్, ధర్మానంద్, అవినాష్ జైస్వాల్, అమృత్ కుమార్ జైన్, ప్రశాంత్ సురానా జైన్‌లకు కూడా అవార్డు ప్రకటించారు. కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్‌ఎన్‌ఐ, ఢిల్లీ డైరెక్టర్ జనరల్ ఎం.ఎ,ఖాన్, కలాంతో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, 5 సంవత్సరాల పాటు మాజీ రాష్ట్రపతి అబు ్దల్‌కలాంకు ప్రెస్ సెక్రటరీగా పని చేసిన తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ముఖ్యంగా ఏ సమస్యనైనా సంప్రదింపులు, చర్చల ద్వారా పరిష్కరించవచ్చుననే ఆయన సిద్ధాంతం, తననెంతగానో ప్రభావితం చేసిందన్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గాల ద్వారా వివిధ మతాల గల దూరాన్ని తొలగించవచ్చని పలు సార్లు ఆయన తన కార్యాచరణ ద్వారా నిరూపించారన్నారు. ప్రతి పౌరుడు దేశానికి / జాతికి తను ఎమి ఇవ్వగలిగానని ప్రశ్నించుకున్నప్పుడు తన గమ్యం స్పష్టమౌతుందని ఆయన ఎప్పుడు చెబుతుండేవారని అన్నారు. దేశాధ్యక్షులుగా ఉన్నంతకాలం యువతను ముఖ్యంగా విద్యార్ధులను కలిసి వారితో ముచ్చటించేందుకు ఎప్పుడు ఆశక్తి చూపేవారని అన్నారు. హైదరాబాద్ లోని డిఆర్డిఎల్‌లో సైటింస్టుగా పసి చేసిన కారణంగా ఆయనకు ఈ నగరం పై ఎనలేని అభిమానం ఉండేదని ప్రెసిడెంట్ హోదాలో 22 సార్లు హైదరాబాద్‌ను ఆయన సందర్శించారని తెలిపారు. కలాం ఎప్పుడు పని చేస్తునే మరణించాలని కోరుకునేవారని ఆయన అనుకున్న విధంగానే షిల్లాంగ్ యునివర్సిటిలో ప్రసంగిస్తునే సూనాయాస మరణానికి ఆయన గురియ్యారని గుర్తు చేశారు. ప్రధానంగా విజన్ 2020 ద్వారా భారత దేశాన్ని ఏవిధంగా ఆవిష్కరించాలో ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి ఆ లక్ష్యాన్ని సాధించడమే ఆయనకు మన మందించే నిజమైన నివాళి అని పేర్కోన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పై ఆదిల్ రహీల్ రచించిన లఘు నాటికను ప్రదర్శించిన బృందాన్ని ఆయన అభింనందిస్తూ ఈ నాటికను ఢిల్లీలో కూడా ప్రదర్శించాలని సూచించారు.సమాచార శాఖ కమీషనర్, ఫైనాన్స్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లడుతూ గంగాజమున సంస్క ృతి విరాజిల్లే హైదరాబాద్ నగరంలో అత్యంత గౌరవనీయ వ్యక్తి అబ్దుల్ కలాంను ప్రథమ వర్ధంతి సందర్భంగా సంస్మరణించుకోవడం విశిష్ట ఘటంటమన్నారు. అవార్డు గ్రహీతలందరూ మజీ రాష్ట్రపతి కలాం సందేశాన్ని ప్రపంచంలోని నలుమూలలకు తీసుకు వెళ్లాలని సూచించారు. తాను కృష్ట జిల్లా కలెక్టరు గా ఉన్నప్పుడు కలాం అధ్యక్ష హోదాలో వచ్చారని ఆయనను రిజీవ్ చేసుకునేందుకు వెళ్లిన తనకు ఆయన నిరాడంబరత ఆశ్చర్యం వేసిందన్నారు. అప్పుడే ఆయనను పీపుల్స్ ప్రెసిడెంట్ అని ఎందుకంటారో అర్థమైందంటూ కమీషనర్ వ్యాఖ్యానించారు. కలాం జీవితానికి సంబంధించిన లఘునాటిక చాలా గొప్పగా ఉందని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లీ ప్రజలందరూ చూసేఅవకాశాన్ని కల్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కౌన్సిల్ ఫర్ పీస్ అండ్ సాలిడారిటి ఆఫ్ ఇండియా సంస్థ ప్రెసిడెంట్ షేక్ ఇస్మాయిల్, వైస్ ప్రెసిడెంట్ ప్రసన్ బండారి, మహిళా విభాగం అధ్యక్షురాలు సరోజిని బండారి, హఫీజ్ పాషా, సిద్ధిక్, ఖభీర్, బినా, మిసెస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.