కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు: సీఎం

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీలో కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తరచూ కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయని భవిష్యత్‌లో అలాంటి ఘటనలు పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. విద్యాపక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా రూ. 2కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంను సీఎం ప్రారంభించారు.