కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఐ ధర్నా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కళాశాలకు పక్కా భవనాలను నిర్మించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఐ జిల్లా కార్యదర్శి రవితో పాటు పాలిటెక్నిక్‌ విద్యార్థులు పాల్గొన్నారు.