కలెక్టర్ కార్యాలయానికి నూతన సొగసులు
ఖమ్మం, జనవరి 28 (): జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అధికారులు కొత్త హంగులు, రంగులు దిద్దుతున్నారు.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఛాంబర్లతో పాటు ప్రధాన క్యారిడార్లను కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. కార్యాలయంలో నూతన ప్లాన్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం చీకటిగా ఉండే కలెక్టర్ కార్యాలయం లోపాల సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం పట్టణంలో తరచూగా విద్యుత్ అంతరాయం కలుగుతుండడంతో కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేశారు.