కల్తీకల్లు బాధితుడి మృతి

0vsxnr15నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో కల్తీకల్లు మహమ్మారి బారిన పడిన ఓ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. తక్కెళ్ల గ్రామానికి చెందిన ఏడుగురు కల్తీకల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ వారం రోజుల నుంచి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో షాహుకారు అనే వ్యక్తి శనివారం ఉదయం మృతి చెందాడు. దీంతో షాహుకారు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.