కల్యాణలక్ష్మికి రూ.150కోట్లు

రంగారెడ్డి,మార్చి3(జ‌నంసాక్షి): పరిగి రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ. 150కోట్లు కేటాయించినట్లు సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్‌ డా. ఎంవీరెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పరిగిలోని ఏఎస్‌డబ్యూవో కార్యాలయాన్ని సందర్శించి పథకంపై సవిూక్షించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 30వేల కుటుంబాలకు సాయం చేయవచ్చని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,822 దరఖాస్తులు రాగా 2,282 దరఖాస్తులు పరిశీలించి మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 219 రిజిసేషెన్‌కాగా 146 మందికి మంజూరు చేశామన్నారు. వసతిగృహ సంక్షేమాధికారులు గ్రామాల్లో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పథకానికి నిధుల కొరత లేదని.. అంకితభావంతో పనిచేసి పేదలకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సహాయ సంక్షేమాధికారి మోహన్‌రెడ్డి, పలువురు వా/-డ్గం/న్‌లు పాల్గొన్నారు.కల్యాణలక్ష్మి పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎంవీరెడ్డి ఆలూరు గ్రామాన్ని పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. గ్రామంలో కల్యాణలక్ష్మి పథకం లక్ష్యం నెరవేరక పోవడానికి గల కారణాలను మంగళవారం మండల కేంద్రంలో ఏఎస్‌డబ్ల్యూని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పథకాలపై అవగాహన కల్పించకపోవడం వల్లే దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పథకం పేదలకు అందడం లేదని ఆయన అన్నారు. అంబేద్కర్‌ యువజన సంఘాలు, మహిళా సంఘాల సాయంతో అర్హులైన వారు పథకం సద్వినియోగ పరచుకునేలా చూడాలన్నారు. ఎంవీరెడ్డితో ఏఎస్‌డబ్ల్యూ శ్వేతా ప్రియదర్శిని, వా/-డ్గం/న్‌ మాధవి ఉన్నారు.