*కల్లు గీత కార్మికులకు మెడికల్ బోర్డ్ నిబంధనలు మార్చాలి*
రామన్నపేట సెప్టెంబర్ 14 (జనంసాక్షి)
గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి క్రింద పడితే మెడికల్ బోర్డ్ నిబంధనల పేరుతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కల్లు గీత కార్మిక సంఘం మండల నాయకులు ఎర్ర రవీందర్ అన్నారు.కొమ్మాయిగూడెం గ్రామంలో గీత కార్మికులతో కలసి మండల మహాసభల జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ గీత కార్మికులకు వృత్తి పనిలో ప్రమాదం జరిగితే మెడికల్ బోర్డ్ నూతన నిబంధనల మూలంగా తీవ్ర నష్టం జరుగుతుందని,గ్రీత కార్మికుని ప్రాణాలకు హాని జరుగుతుందని అన్నారు. పాత నిబంధనలు అమలు చేస్తూ గీతన్నల సంక్షేమానికి ఐదు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. 18న జనంపల్లిలో జరిగే గీత కార్మికులు మండల మహాసభకు గీతన్నల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొలగోని స్వామి,అంతటి సత్తయ్య,గిరుకాల శంకరయ్య,ఎర్ర మల్లయ్య,బాలగొని కృష్ణ,ఎర్ర తిరుమలేష్,బోయపల్లి శ్రీశైలం,ఆకిటి యాదయ ,తండా రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.