కల్వర్టు నిర్మించకుంటే మున్సిపాలిటీ ముట్టడిస్తాం.

 

జహీరాబాద్ అక్టోబర్ 1( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణములోని రహమత్ నగర్ కాలనీలో చిన్నపాటి వర్షానికే మురికినీరు ఇళ్లలోకి వస్తున్నాయని, మిగిలిపోయిన కల్వర్టు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది, స్పందించిన మున్సిపల్ అధికారులు రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించడం జరిగిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.మహిపాల్ అన్నారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణంలోని రహ్మాత్ నగర్ కాలనీ లో చిన్నపాటి వర్షం పడ్డా ఇళ్లలోకి నీరు చేరుకుంటుందని అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఇప్పటికే దోమలు ఈగలతో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే కల్వర్టు నిర్మించి నీటిని మళ్ళించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై గత అనేకసార్లు విన్నవించిన పరిష్కరించకపోవడంతో రహ్మాత్ నగర్ కాలనీ నుండి మునిసిపాలిటీ వరకు పాదయాత్ర నిర్వహించాలని భావించినట్లు తెలిపారు, మున్సిపల్ కమిషనర్ గారు సత్వరమే స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సలీమోద్దీన్, కాలనీవాసులు బాబు మియా, అమీర్, సైలాని, నారాయణ, తదితరులు, మున్సిపల్ అధికారులు అయిన సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి, ఇతరులు రాజ్ కుమార్, శ్రీధర్ వచ్చి హామీ ఇచ్చారు.