కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలి : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని అరోపించారు. సీబీఐ అనేక ఛార్జిషీట్లలో వైఎస్‌ తనయుడిని దోషిగా నిలబెట్టిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలని చెప్పారు. దొంగల రైలులో డ్రైవర్‌ మాత్రమే మారాడు, దొంగ మంత్రులు కొనసాగుతున్నారని విమర్శించారు. అరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ప్రభుత్వం సాయం అందించకూడదని అన్నారు. అవినీతిపరులను ఉపేక్షించేది లేదని… అవినీతిని పాల్పడినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.