కళంకిత మంత్రులను వెనకేసుకురావడం తగదు: వీహెచ్
హైదరాబాద్: అంబర్‌పేటలో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టుబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు సీఎం జోక్యం చోసుకోవాలని లేకపోతే మే 5న ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. కళంకిత మంత్రులను సీఎం వెనకేసుకురావడం తగదని అన్నారు. కేవలం సర్వే నంబర్ చెబితేనే వూరి పేరు, యజమాని పేరు చెప్పే నిష్ణాతుడు కేవీపీ అని చెప్పారు.