కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు

నవవధువు ఆత్మహత్య

యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి అయిన నెల రోజుల నుండే అదనపు కట్నం కోసం భర్త వేధింపులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే కళ్యాణలక్ష్మి డబ్బులు తనకే ఇవ్వాలని భర్త విక్రమ్‌ బాండ్‌ రాయించుకున్నాడు. కళ్యాణలక్ష్మి డబ్బులు ఇవ్వకపోతే ఆస్తి ఇవ్వాలంటూ షరతు పెట్టాడు. అయితే.. సకాలంలో వధువు తరపువారు డబ్బులివ్వకపోవడంతో విక్రమ్‌ భార్యను వేధించాడు. రెండ్రోజుల క్రితం అత్తగారింటికి వచ్చి నానా హంగామా చేశాడు. భర్త ప్రవర్తనతో అవమానానికి గురైన మానస ఆత్మహత్యకు పాల్పడింది.