కళ్ళజోడు పంపిణీ కార్యక్రమంలో జడ్పీటీసీ అనిల్ జాధవ్.
మానవ మనుగడకు కళ్ళు సరిగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలరని అనిల్ జాధవ్ అన్నారు.శనివారం రోజున మండల కేంద్రంలోని ఎల్వి ప్రసాద్ కంటి చికిత్స కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్ళజోడు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ హాజరై ఆయన చేతుల మిదుగా మహిళలకు కళ్ళజోడు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారు ఉచిత కంటి పరీక్షలు చేయించుకుని జీవిత భాగస్వామిగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనిల్ జాదవ్ తోపాటు మాజీ ఎంపిటిసి డాక్టర్ జహీర్ విడిసి చైర్మన్ రవీందర్ రెడ్డి లింబాజి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
