కాంగ్రెస్‌తో చర్చలు ఫలప్రదం: కేసీఆర్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానం మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు తెరాస అధినేత కేసీఆర్‌ చెప్పారు. ఢిల్లీనుంచి హైదరాబాద్‌ బయలుదేరివెళ్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలోని చాలామంది నాయకులతో చర్చలు సాఫీగా, ఫలవంతంగా సాగాయని పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన దానికంటే ఎక్కువ మంది నేతలను కలిశానన్న కేసీఆర్‌ తెలంగాణపై తుది విడత చర్చలు త్వరలో జరుగుతాయని అన్నారు.