కాంగ్రెస్‌ను కేసీఅర్‌ సైతం నమ్మడం లేదు :

హైదరాబాద్‌ : తెలంగాణపై కేసీఅర్‌ కేంద్రానికి ఇచ్చిన గడువు ఇంకా రెండ్రోజులే ఉందని.అలోపు అనుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెరాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఢిల్లిలో జరిగే పరిణామాలను కేసీఅర్‌ బహిరంగంగా చెప్పలేకపోతున్నారని అన్నీరు. కేసీఅర్‌ డిల్లీలో ఉన్నంత మాత్రాన ఉద్యమం అగేదిలేదని మరో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ స్పష్టం చేశారు. కేసీఅర్‌ సైతం కాంగ్రెస్‌ను నమ్మడం లేదని అయన అన్నారు.