కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో టీ నేతల భేటీ
తెలంగాణ రాష్ట్రం ప్రకటించండి
కిరణ్‌పాలన భేష్
సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని మార్చొద్దని విన్నపం
న్యూడిల్లీ : ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ని మార్చవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యేలు కేంద్రమంత్రి రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్ గూలాం నబీ ఆజాద్‌ను కలిసి వజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. పలువురు తెలంగాణ ఎమ్మేల్యేలు ఆజాద్‌తో భేటి అయ్యారు. కిరణ్ సమర్థుడైన ముఖ్యమంత్రి అని ఆయనను మార్చుతారంటూ ఊహగానాలు వస్తున్నాయని,మార్చవద్దని ఈ సందర్బంగా వారు విజ్ఞప్తి చేశారని తెలుస్తుంది.
ముఖ్యమంత్రి చేపడుతున్న ఇందిరా బాట కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి దోహదపడుతుందని,అభివృధ్ది చేయడంతో పాటు కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుక వెళ్ళేందుకు ఉపయోగపడుతుందని చెప్పరయనా..ఇలాంటి సమయంలో
కిరణ్‌ను మార్చవద్దని విజ్ఞప్తి చేశారట. అయితే తాము తెలంగాణ తప్ప అధిష్టానం వద్ద మరో మాట మాట్లాడలేదని ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ కిరణ్‌పాలన హర్ణనీయమని, ఇందిరమ్మ బాటతో అభివృద్ది చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారని ఆయన తెలిపారు.