కాంగ్రెస్‌ గారడి మాటలను ప్రజలు నమ్మరు

మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన ఖర్మ లేదు: రామలింగారెడ్డి
సిద్దిపేట,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ కొఒట్టామనిఉత్తమ్‌ కుమార్‌ చెప్పడం చూస్తుంటే వారికి ఎంతగా భయం పట్టుకుందో తెలుస్తందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కూటమి కట్టినా ఓటమి తప్పదన్న భయం వారిలో కనిపిస్తోందన్నారు. మేనిఫెస్టోలో రైతులు, నిరుద్యోగులకు భరోసా
కల్పించడంతో ఆయా వర్గాలు ఇప్పుడు టిఆర్‌ఎస్‌ బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. ఇకనైనా కాంగ్రెస్‌ తమ గారడీలను కట్టిపెట్టాలన్నారు. దుబ్బాకలో బతుకమ్మ సంబరాలను పరుస్కరించుకుని ఆయన మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు. పండగలకు వైభవం తీసుకుని వచ్చిన ఘనత కూడా టిఆర్‌ఎస్‌దన్నారు. అరవై ఏళ్లు రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఏనాడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, మాట తప్పడం ఆ పార్టీ నైజమని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు మరచిన హావిూలన్నీ తీర్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు.2009 ఎన్నికల సందర్భంగా 9 అంశాలను మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్‌.. వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా, వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన కరెంట్‌, రేషన్‌ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, గ్యాస్‌ ధర తగ్గింపు, ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకుపైగా భూములకు సాగునీరు వంటి హావిూలను విస్మరించిందని అన్నారు.  కాంగ్రెస్‌ నేతలు.. అభివృద్ధి అంతా గజ్వేల్‌, సిద్దిపేటలలోనే జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని.. కానీ గజ్వేల్‌లో కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఆ పార్టీకి చెందిన నాయకుల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. కేసీఆర్‌ నేతృత్వంలో వంద సీట్లతో మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు.

తాజావార్తలు