కాంగ్రెస్ నేతలు ఇకనైనా విమర్శలు కట్టిపెట్టాలి
రైతుల ఆగ్రహానికి గురికాకుండా చూసుకోవాలి: ఎమ్మెల్యే
సిద్దిపేట,మే11(జనం సాక్షి ):అన్నదాతల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పంటల పెట్టుబడుల కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒక్కొక్క రైతుకు ఒక పసలుకు రూ. 4 వేలు చొప్పున, సంవత్సరానికి రూ. 8 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందుకు కారణం పంటలకు గిట్టుబాటు ధర, కరంట్ సరిగా లేకపోవడమేనన్నారు. వీరు సాయాన్ని గుర్తించకపోయినా విమర్వించకుండా ఉంటే మంచిదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఓ సబరం జరుగుతంటే కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర
కల్పించడం, వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల పాటు కరంట్ సౌకర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దేశానికి దిక్సూచిగా నిలిచారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎప్పుడైనా ఇలా రైతుల గురించి ఆలోచన చేసిందా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన రైతుబంధు పథకంలో భాగంగా చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ ఓ పండగలా ఊరూవాడా జరగడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని అన్నారు. తమకు ఇక పుట్టగతులు ఉండవన్న భయం వారిని పట్టుకుందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పంటల పెట్టుబడుల కోసం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిని అప్పుల బాధ నుంచి తప్పించడానికి ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. అలాగే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరాదరణకు గురై
పూడుకుపోయిన వేలాది చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పూడిక తీయించి ఆ చెరువులలో గోదావరి జలాలను నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతీ రైతుకు రైతుబంధు పథకం కింద చెక్కులను అందిస్తున్నామన్నారు.