కాంగ్రెస్‌ నేతలు కలలు కనడం మానాలి

పథకాలే ఇక మా ప్రచారాంశాలు: సోలిపేట

సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్‌ వారికి భంగపాటు తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే రామలింవగారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు కలలు మాని ప్రబుత్వం అందచేస్తున్న పథకాలను ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలన్నారు. రైతుబందు, బీమా తదితర పథకాలు రైతులకు చేరేలా చూడాలన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలిచ్చాయన్నారు. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయా లు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అ డుగులు వేయగలిగామని అన్నారు. ఈ పథకాలే తమ ఎన్నికల ప్రచారాంశాలని అన్నారు. వేరే విమర్శలకు తావు లేకుండా తాము కెసిఆర్‌ అమలు చేస్తున్న పథకాలనే ప్రజలకు వివరిస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం జిల్లా ప్రజలకు వరం లాంటిదని అన్నారు.ఈ పథకం రైతన్నల్లో విశ్వాసాన్ని, ఆత్మైస్థెర్యాన్ని నింపిందని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని మండలాల తహసీల్దార్లకు రిజిస్టేష్రన్‌ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తున్నదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తేలిన సమాచారాన్ని

పొందుపరుస్తూ ప్రభుత్వం ధరణి పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిందన్నారు. మరణించిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమా క ల్పించాలని నిర్ణయించిందన్నారు.