కాంగ్రెస్ శ్రేణులకు భరోసా దక్కేనా?
అధక్షపదవిని వదులుకున్న తరవాత కొంతకాలం పాటు రాహుల్ విశ్రాంతి తీసుకోవడ ఖాయం. ఇప్పుడు మళ్లీ సోనియా చేతికిపగ్గాలు రావడంతో కాంగ్రెస్ కురువృద్దుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వచ్చే మూడు రాష్టాల్ర ఎన్నికల్లో విజయం ఖాయం అంటూ కాంగ్రెస్ ఆశలపల్లకిలో విహరించడం ఖాయం. నిజానికి రాహుల్ అలాగే కొనసాగుతూ నమ్మకస్తులైన యువనేతలను పార్టీకి తీసుకుని ఉంటే కాంగ్రెస్ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ గబ్బి లాల్లా వేలాడుతున్న వృధ్ద జంబుకాలు మళ్లీ సోనియాకు పగ్గాలు అప్పగించే వరకు నిద్రపోలేదు. అధికారంలో ఉంటే సొంత గోల తప్ప ప్రజల గోలను పట్టించుకోవడం కూడా కాంగ్రెస్‌కు కష్టమే. కాంగ్రెస్ గత దశాబ్ద పాలనా కాలంలో పెద్దగా దేశానికి ఒరగబెట్టిందేవిూ లేదు. యువనేతలను ముందుకు తీసుకుని వచ్చివుంటే పార్టీకి జోష్ వచ్చేది. అంతేగాకుండా అధికారంలో ఉండగా కుంభకోణాల్లో కూరుకుని పోయింది. వారికి వ్యూహం లేకపోవడం వల్లనే పార్లమెంటులో కాశ్మీర్ విషయంలో పేలవమైన నిర్ణయం తీసుకున్నారు. 370 రద్దును స్వాగతించి కాశ్మీర్‌కు అభివృద్దికి ప్యాకేజీ తదితర విషయాల్లో మాట్లాడి వుంటే కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉండేది. ఇకపోతే సోనియా పగ్గాలు చేపట్టినా, ఇప్పుడు పాతుకుపోయిన బిజెపిని పెకిళించడం అంతసులువు కాదు. 370 రద్దు, త్రిబుల్ తలాఖ్ నిర్ణయాలతో మోడీ,అమిత్ షాల ఛరిష్మా ఆకాశమంత ఎంత్తుకు ఎదగింది. దానిని నిలువరించే సత్తా కాంగ్రెస్‌కు లేదనేచెప్పాలి. అంతేగా కుండా అసాధ్యమని కూడా చెప్పాలి. ఇకపోతే వివిధ రాష్టాల్ల్రో కాంగ్రెస్ అంతకంతకూ దిగజారిపోతోంది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో మళ్లీ ప్రాభవం సాధించాలంటే ఏదో ఒకటి చేసినా లాభం లేదన్న స్థాయికి చేరింది. తమిళనాడు తరవాత ఇప్పుడు తెలుగు రాష్టాల్ల్రో కాంగ్రెస్ చరిత్ర ముగిసినట్లే. ఎపిలో ప్రత్యేక¬దా బిల్లు కోసం హావిూలు గుప్పించినా ప్రజలు నమ్మలేదు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలను ప్రోత్సహించడంతో ఆ పార్టీ ఖాళీ అయ్యింది. దీంతో కార్యకర్తల్లో భరోసా నింపాలని ఆపార్టీ వ్యూహం రచించింది. ప్రజలు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో ఆందోళన నిర్వహించి వారికి దగ్గర వ్వాలని ప్రణాళిక వేసినా ఫలించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం పేరుతో వేలాది కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది. ఇకపోతే ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత జరగుతున్న కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు. ప్రత్యేక¬దాపై కోటి సంతకాలు మొదలు, అనేక ఉద్యమాలు చేసినా ప్రజలు దగ్గరకు రానివ్వలేదు. కాంగ్రెస్ కారణంగా ఎపికి ప్రత్యేక¬దా పెండింగ్‌లో ఉంది. అలాగే విభజన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే అసెంబ్లీ సీట్ల పెంపు అలాగే ఉండిపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత నిరాశ నిస్పృహలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు భరోసా కల్పించడానికి ఇప్పుడు సోనియా నాయకత్వంలో ఏ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ముఖ్యం. ఎన్నికలకు ముందు తెరాస ఇచ్చిన హావిూలను ప్రస్తావిస్తూ వాటి అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి వరకు అనావృష్టితో రైతులు ప్రభుత్వంపై కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. అయితే మళ్లీ వర్షాలు డడం, రైతుబంధు అందడంతో తెలంగాణలో కాంగ్రెస్ ఉద్యమాలకు అవకావం లేకుండా పోయింది. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కాంగ్రెస్ నేతలంతా మండిపడ్డా ప్రజల్లో స్పందన కానరావడం లేదు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యచేసుకుంటూ ఉంటే పట్టించు కోవడం లేదంటూ విమర్శలు చేస్తున్నా మద్దతు రావడం లేదు. వీరు ప్రజల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేశారు.కేసీఆర్‌కు కనీసం రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక కూడాలేదంటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అప్పుల పాలై నిరాశలో ఉన్న రైతులకు తాము అండగా ఉండి పోరాడతామని భరోసా కల్పించారు. దీనికితోడు అక్రమంగా రైతుల భూములను సేకరిస్తే ఎకరం భూమిని కూడా పోనివ్వకుండా అండగా ఉంటామని రైతులకు సంకేతమిచ్చారు. అయితే ఇవేవీ ఉభయ తెలుగు రాష్టాల్ల్రో కాంగ్రెస్‌కు ఆదరణ ఇవ్వలేకపోయాయి. ఎపిలో అయితే లేవకుండా పోయారు. ఇక మిగిలింది తెలంగాణలో. ఇక్కడ కూడా గెలిచిన వారంతా అధికార టిఆర్ఎస్లో చేరారు. రాహుల్ పోయి సోనియా వచ్చినా పార్టీలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఉండదన్న భావనలో కనాయకుల్లో ఉంది. అందుకే ఆయా రాష్టాల్ల్రో నాయకులు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. వారంతా అధికార బిజెపిలో చేరుతున్నారు. మరో ఐదేళ్ల పాటు బిజెపిలో ఉంటే అధికారానికి దగ్గరగా ఉండవచ్చనన్న భావనలో ఉన్నారు. దీంతో సోనియా పార్టీని రక్షించుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది ముఖ్యం. అలాగే పార్టీ నేతలకు భరోసా కలిగించగలరా అన్నది కూడా ముఖ్యమే. ఈ ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని ఢీకొనే సత్తా కాంగ్రెస్ సాధిస్తుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే.