కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మునగాల ఎంపీపీ
– గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కోదాడ ఎమ్మెల్యే

మునగాల, డిసెంబర్ 09(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ అభివృద్ధి ప్రదాత,  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ యలక  బిందు నరేందర్ రెడ్డి, సర్పంచులు పల్లి రమణ వీరారెడ్డి, ఎంపీటీసీ మిట్టగనుపుల గురుజా, మాజీ కోఆప్షన్ సభ్యులు రషీద్, గ్రామశాఖ అధ్యక్షులు చెవుల నరేందర్, ఎలక గోపిరెడ్డి, ఉపసర్పంచ్  గండు జ్యోతి, 200 మంది టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో చేరిన నాయకులను  కార్యకర్తలకు గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకోదాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి ఆగకుండా వలసలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తెరాస పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో కోదాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, జెడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ రావు, కోదాడ ఎంపీపీ కవిత రాధారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, అన్ని మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ ఉపేందర్ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు యుగంధర్ రెడ్డి, కోల ఉపేందర్, సోమపంగు సైదులు, నాగిరెడ్డి, ఉడుం కృష్ణ,  సీతారాములు, రామ్ రెడ్డి,  అన్ని స్థాయిలో ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.